
ఫోన్ల వినియోగంలో అప్రమత్తత అవసరం
యాలాల: స్మార్ట్ ఫోన్ల వినియోగంలో బాలికలు అప్రమత్తంగా ఉండాలని యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి సూచించారు. శనివారం తాండూరు షీ టీం ఆధ్వర్యంలో అగ్గనూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయంలో అవగాహన ఉండాలన్నారు. అనవసర లింకులు ఓపె న్ చేసి సైబర్ నేరాల బారిన పడొద్దని సూచించారు. ఫొటో మార్ఫింగ్, ఈవ్ టీజింగ్, అత్యవసర సమయాల్లో డయల్ 100, 181 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సాయం పొందాలన్నారు. అనంతరం షీ టీం ఇంచార్జీ శేఖర్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాలతో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలికలు, యువతీ యువకులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీసులు ఉన్నారు.
యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి