
దరఖాస్తుల ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలలో
26, 27న ఇంటర్వ్యూలు
అనంతగిరి: వికారాబాద్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో వివిధ విభాగాలలో (28) సీనియర్ రెసిడెంట్‌లకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని డాక్టర్ దీన్‌దయాళ్ బంగ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న ఉదయం 9నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. వివరాలను జీఎంసీవికారాబాద్.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు. ఈ ఉద్యోగాలకు గౌరవ వేతనం చెల్లించబడుతుందన్నారు.
ప్రొఫెసర్లు, అసోసియేటెడ్,
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు..
కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు(2), అసోసియేటేడ్ ప్రొఫెసర్లు(17), అసిస్టెంట్ ప్రొఫెసర్లు(30) పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దీన్‌దయాళ్ బంగ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని ఆయన సూచించారు. వివరాలను జీఎంసీవికారాబాద్.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు.
23న మెగా వైద్య శిబిరం
తాండూరు టౌన్: పట్టణంలోనిమాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ లలితాదేవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ శిబిరం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రసూతి, పి ల్లల, నేత్ర, ఈఎన్‌టీ, దంత, చర్మ, మానసిక వై ద్యానికి సంబంధించిన స్పెషలిస్టు వైద్యులు ఈశిబిరంలో సేవలందిస్తారన్నారు. మహిళా, శి శు సంరక్షణ సేవలు,టీబీనమోదు, రక్తదాన శి బిరాల నిర్వహణ, మహిళా ఆరోగ్య సేవలు, కి షోర బాలికలు, మహిళలకు అవగాహన కార్య క్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
రైతులే విత్తనాలు
ఉత్పత్తి చేసుకోవాలి
శాస్త్రవేత్త డాక్టర్ సునీత
బంట్వారం: రైతులు తమ పంట పొలాల్లోనే విత్తనాలు ఉత్పత్తి చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ సునీత అన్నారు. శనివారం ఆమె కోట్‌పల్లి, రాంపూర్, ఎన్నారం గ్రామాల్లో వరి, కంది పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీత మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాలు పండించడంలో తీసుకోవాల్సిన మెళకువలను రైతులకు వివరించారు. ప్రతి గ్రామంలో నాణ్యమైన విత్తన పథకం (క్యూఎస్‌ఈవీ) అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రైతులు సాగు చేస్తున్న నాణ్యమైన విత్తన కేత్రాలను సందర్శిస్తున్నామని చెప్పారు. రైతులే విత్తనాలు ఉత్పత్తి చేసుకుని సాగు చేస్తే ఖర్చులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. విత్తనాలు అందుబాటు లో ఉండడటమే కాకుండా నకిలీ సీడ్స్‌తో మోసపోకుండా ఉండవచ్చన్నారు. రైతులు తాము పండించిన విత్తనాలను ఇతరులకు అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కోట్‌పల్లి ఏఓ కరుణాకర్‌రెడ్డి, ఏఈఓలు సందీప్, నర్మద రైతులు పాల్గొన్నారు.
పెంచిన ఆర్టీసీ చార్జీలు
తగ్గించాలి
అనంతగిరి: దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ పెంచిన అదనపు బస్సు చార్జీలను వెంటనే విరమించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఆయన వికారాబాద్ ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం అందజేశారు. పండుగల వేళ బస్సు చార్జీలు పెంచి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. సొంత గ్రామాలకు సంతోషంగా వెళ్లే ప్రయాణికులకు పెరిగిన చార్జీలు భారంగా మారాయన్నారు. ఆయన వెంట ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, వెంకటేశం, విద్యాసాగర్, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం