
జిల్లాస్థాయి పోటీలకు విద్యార్థినుల ఎంపిక
పూడూరు: వికారాబాద్ పట్టణంలో మూడు రోజుల పాటు జరిగిన అండర్ – 14, –17 బాలికల విభాగం వాలీబాల్, ఖోఖో పోటీల్లో మండలంలోని అంగడిచిట్టంపల్లి పాఠశాల విద్యార్థినులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం నరేందర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థినులు జోనల్ స్థాయిలో ప్రతిభ చాటి మెడల్స్ సాధించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఈటీ సత్యనారాయణ, ఉపాధ్యాయులుశ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు
వ్యాసరచన పోటీలు
తాండూరు టౌన్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత మాట్లాడుతూ.. మోదీ జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ ముదిరాజ్, నాగారం మల్లేశం, భద్రేశ్వర్, కృష్ణ, కిరణ్, ప్రహ్లాద్, ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, అనంతప్ప తదితరులు పాల్గొన్నారు.
ఆత్మరక్షణకు
తైక్వాండో దోహదం
తాండూరు టౌన్: ఆత్మరక్షణకు తైక్వాండో ఎంతగానో దోహదపడుతుందని జిల్లా తైక్వాండోఅసోసియేషన్ సెక్రటరీ ఆర్ రాజు అన్నారు. శుక్రవారం స్థానిక సెయింట్ మార్క్స్ జూబ్లీ పాఠశాల ఆవరణలో శిక్షితులైన తైక్వాండో క్రీడాకారులకు ఫిట్‌నెస్, టెక్నికల్ విభాగాల్లో పరీక్ష నిర్వహించారు. అనంతరం బెల్టులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జోసెఫ్, డీన్ సతీషన్, తైక్వాండో కోచ్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
వీధి వ్యాపారులకు రుణాలు
అనంతగిరి: వీధి వ్యాపారులు లోక్ కళ్యాణ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ సూచించారు. శుక్రవారం వికారాబాద్‌లోని మెప్మా కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీ వరకు లోక్ కళ్యాణ్ మేళా శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద వీధి వ్యాపారులకు మూడు దశల్లో రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో రూ.15 వేలు, రెండో దశలో రూ.25 వేలు, మూడో దశలో రూ.50 వేల వరకు రుణాలు ఇస్తారన్నారు. ఈ మొత్తాన్ని 12, 18, 36 నెలల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. రుణాలు సక్రమంగా చెల్లించే వారికి రూ.30 వేల విలువ చేసే రూపే క్రెడిట్ కార్డులు అందేలా చూస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలు కొనసాగించాని ఇలా చేస్తే ఏడాదికి రూ.1,600 క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కొత్తగా వ్యాపారం చేయాలనుకూనే వారు రుణాల కోసం మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవి కుమార్, వికారాబాద్ టీఎంసీ వెంకటేష్, కెనరా బ్యాంక్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి, మెప్మా సిబ్బంది, పలువురు వీధివిక్రయదారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి పోటీలకు విద్యార్థినుల ఎంపిక

జిల్లాస్థాయి పోటీలకు విద్యార్థినుల ఎంపిక