
ఆగ్రోస్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
పరిగి: ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఆగ్రోస్ కేంద్రాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మా ట్లాడుతూ.. ఈ కేంద్రాల్లో రైతులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల మందులు, ఎరువులు ఉంటాయన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మందులు, ఎరువులు విక్రయించాలని సూచించారు. రై తులు నానో యూరియా, నానో డీఏపీ వాడాలన్నా రు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభు త్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, నాయకులు రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి