
రక్షణ చట్టాన్ని అమలు చేయాలి
● నిందితులను కఠినంగా శిక్షించాలి
● న్యాయవాదుల విధుల బహిష్కరణ
కొడంగల్ రూరల్: న్యాయవాదులపై దాడులకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని కొడంగల్ బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం విధులు బహిష్కరించి, నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంసీసీబీఏ, నాంపల్లి కోర్టు జీవితకాల సభ్యులు, సీఓపీ న్యాయవాదులు అనిల్‌కుమార్‌బోగా, హనుమాన్‌నాయక్‌పై దాడికి పాల్పడటం దారుణమన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు కోసం నిరిహార దీక్ష చేస్తున్న సంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బా ర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ప్రధాన కా ర్యదర్శి బి.వెంకటయ్య, ఉపాధ్యక్షుడు బస్వరాజు, న్యాయవాదులు ఏవీ.ఆనంద్, టి.కరుణాకర్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్, కె.రాములు, బి.కృష్ణయ్య, కె.రమే శ్, భానుప్రసాద్, రవీందర్‌నాయక్, మోహిద్, జి.శివరెడ్డి, చంద్రమోహన్, భీమయ్య పాల్గొన్నారు.