
జీవన్గీ పాఠశాలకు మహర్దశ
బషీరాబాద్: వరండా చదువులు ఇంకెన్నాళ్లు శీర్షికన గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. మండలంలోని జీవన్గీ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు, వసతులు లేక విద్యార్థులు పడుతున్న బాధలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఉదయం పాఠశాలను మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ యశ్వంత్, సిబ్బంది సందర్శించారు. రూ.40 లక్షలతో కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం విజయ్‌కుమార్, మాజీ సర్పంచ్ రాములు, కాంగ్రెస్ నాయకులు దేశ్‌ముఖ్ సంగారెడ్డి, తలారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.