
నేడు డయల్ యువర్ డీఎం
తాండూరు టౌన్: ప్రయాణికులు బస్సుల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తాండూరు ఆర్టీసీ డిపో మేనేజన్ సురేష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రయాణికులు సెల్ నంబర్ 9959226251కు కాల్ చేసి సమస్యలు తెలియజేయాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.
తాండూరు టౌన్: చిన్నారులు ఎదుర్కొంటున్న వ్యాధులు, నిర్ధారణ, నివారణ, చికిత్స కోసం నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ గిరిధర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరులోని ఇందిరానగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను వైద్య శిబిరానికి తీసుకురావాలని కోరారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్
ధారూరు: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంపై బీజేపీకి మాట్లాడే హక్కు లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ అన్నారు. గురువారం ధారూరులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజాం పాలన తరహాలోనే ప్రధాని మోదీ పాలన సాగుతోందని ఆరోపించారు. కమ్యునిస్టుల పోరాట చరిత్రను వక్రీకరించారని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు లక్ష్మయ్య, మల్లయ్య, వెంకటేశ్, సుదర్శన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కమిటీని గురువారం పట్టణంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొడంగల్ శాఖ అధ్యక్షుడిగా కె.రాధాకృష్ణ, కార్యదర్శిగా డి.వెంకటయ్య, కోశాధికారిగా చంద్రప్ప, అసోసియేట్ అధ్యక్షుడిగా హన్మయ్య, ఉపాధ్యక్షులుగా నర్సప్ప, కె.యాదగిరి, సహాయ కార్యదర్శిగా కె.ప్రభాకర, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సిహెచ్.నరేందర్, ప్రచార కార్యదర్శిగా మోహన్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్లుగా బాబుసింగ్, రఘువీర్‌సింగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు.
అదనపు కలెక్టర్ సుధీర్
అనంతగిరి: మహిళా సంఘాలను బలోపేతం చేయాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంటే ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది 800 సంఘాలకు రూ.100 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించాలన్నారు. సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్, డిస్ట్రిక్ మిషన్ కోఆర్డినేటర్ రవి కుమార్, వెంకటేష్, రాజేంద్రప్రసాద్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

నేడు డయల్ యువర్ డీఎం