
సీఎంఆర్ తక్షణం అందజేయాలి
అనంతగిరి: యాసంగి సీజన్ 2024–25కు సంబంధించి బకాయి కస్టమ్ మిల్లింగ్ బియ్యం(సీఎంఆర్)ను మిల్లర్లు తక్షణం అందజేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. అలాగే ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన బియ్యం డెలివరీని వేగవంతం చేయాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రైస్ మిల్లర్లతోసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లు సామర్థ్యం మేరకు సీఎంఆర్ ను ఎఫ్‌సీఐకి అందజేయాలన్నారు. బ్యాంక్ గ్యారంటీ లేకుండా వడ్లు ఇవ్వడానికి వీలు లేదన్నారు. ఎఫ్‌సీఐ అధికారులు డెలివరీకి అనుగుణంగా గోదాంలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ మోహన్‌కృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్, శ్రీనివాస్ గుప్తా, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్