
కార్మిక సమస్యలు పరిష్కరించాలి
పరిగి: కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను విడుదల చేయాలని బుధవారం నగరంలోని విద్యా కమిషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. భోజన కార్మికులు, సీఐటీయూ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌లు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేసుకుంటే ప్రభుత్వం అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. సర్కారు కార్మికులకు ధర్నా చేసే హక్కులను కాలరాస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు కార్మికులకు రూ.పది వేలు ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఇవ్వడం లేదన్నారు. భోజన కార్మికులకు బిల్లులు, గౌరవ వేతనాలు సక్రమంగా రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రవికుమార్, శ్రీశైలం, సువర్ణ, రాములమ్మ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ