
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
కొడంగల్ రూరల్: విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని కొడంగల్ ఎంజేపీటీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సూచించారు. గురువారం మండల పరిధిలోని ఉడిమేశ్వరం గ్రామ సమీపంలో ఉన్న కొడంగల్ ఎంజేపీటీ కళాశాల, దౌల్తాబాద్ ఎంజేపీటీ పాఠశాలల్లో నిర్వహించిన నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందాలని సూచించారు. గతేడాది ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి వారికి బహుమతులు అందించారు. అనంతరం విద్యార్థులు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్, ఎంజేపీ కొడంగల్ పాఠశాల ప్రిన్సిపాల్ నగేశ్, ఏటీపీ రేఖ్య నాయక్, కాశప్ప, ఉపాధ్యాయులు అనంతరాములు,నరేశ్, విజయ్, కిషన్, అశ్విని, మాణేప్ప, రాధ, రాములు, వెంకటేశ్, అనిల్, నరేందర్, రత్నం తదితరులు పాల్గొన్నారు.
ఎంజేపీటీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్