
బీసీలు అన్ని రంగాల్లో రాణించాలి
షాబాద్: బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించాలని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో బీసీసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం బీసీసేన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా కడుమూరు విఠలయ్య, ఉపాధ్యక్షుడిగా కడుమూరి అశోక్, ప్రధాన కార్యదర్శిగా కావలి రాములు, కోశాధికారిగా కావలి సత్తయ్యలను ఎనుకున్నారు. యువజన కమిటీ అధ్యక్షుడిగా కావలి సందీప్, ప్రధాన కార్యదర్శిగా కడుమూరి ఆనంద్, ఉపాధ్యక్షుడిగా మహేందర్, కార్యదర్శిగా బుగ్గరాములు, కోశాధికారిగా ఉండాల మల్లేష్‌లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ.. ఆధిపత్య పోరుతోనే బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారని చెప్పారు. అందుకే బీసీలకు అండగా ఆర్.కష్ణయ్య ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి బీసీలను బలోపేతం చేస్తున్నామన్నారు. బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, మండల అధ్యక్షులు దయాకర్‌చారి, యూత్ అధ్యక్షుడు అజయ్‌కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ