
మద్యం తాగి వాహనం నడపొద్దు
మోమిన్‌పేట: మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేస్తామని ఏఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని మొరంగపల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు నడుపుతున్న సమయంలో మద్యం తాగరాదన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనానికి సంబంధించి అన్ని పత్రాలు ఉండాలన్నారు. నంబరు లేని వాహనం రోడ్డు ఎక్కకూడదని హెచ్చరించారు. నిషేధిత వస్తువులను రవాణా చేయ్యెద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బలరాం, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.