పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నవాబుపేట: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య భరోసా ఇచ్చారు. ఆదివారం మండల పరిధిలోని గంగ్యాడలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాది పేదల ప్రభుత్వం ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగదన్నారు. విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. మొదటి విడతలో ఇల్లు మంజూరైన వారు తక్షణమే నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలన్నారు. నిర్మాణ దశలను బట్టి బిల్లులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోవిందమ్మ, నాయకులు మల్లేశం, రామచంద్రారెడ్డి, దాసుగౌడ్, కిష్టయ్య, మాణిక్యం, జంగయ్య, విట్టల్, నర్సింలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య


