
కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు
తాండూరు టౌన్/తాండూరు రూరల్: ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని, వచ్చేది మా ప్రభుత్వమేనని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం తాండూరులో పలు మండలాల నాయకులు, పట్టణంలోని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్‌రెడ్డితో కలి సి పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్‌లో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాండూరు ఎంపీపీ అనితాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రవిగౌడ్, డైరెక్టర్లు అనంతమ్మ, నర్సింహులు, రాఘవేందర్, బిచ్చయ్య, హన్మంత్ రెడ్డి, నారాయణ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. యాలాల మండలం నుంచి పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్ వెంకటయ్య, సీనియర్ నాయకుడు వీరయ్య కాంగ్రెస్‌లో చేరారు. తాండూరు పట్టణంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు భీంసింగ్ రాథోడ్, ప్రవీణ్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు సోఫి యా, ఆఫ్షాబేగం హస్తం పార్టీలో చేరారు.
బషీరాబాద్: అధికార బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి సొంత మండలం బషీరాబాద్‌లో నేతలు ఝలక్ ఇచ్చారు. రెండు పర్యాయాలుగా ఎంపీపీగా కొనసాగుతున్న కరుణ, జెడ్పీటీసీ మిర్యాణం శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్ తోపాటు భారీగా నాయకులు అధికార పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. శుక్రవారం తాండూరులో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. దీంతో పైలెట్ వర్గం ఒక్కసారిగా కంగుతింది. ఇదివరకే మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శాంతిబాయి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు రాము నాయక్,21 మంది సర్పంచులు, ముగ్గురు ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. ఇలా ఎమ్మెల్యే సొంత మండలంలోనే మండల ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్‌లోకి చేరుతుండటం అధికార పార్టీ నేతలను కలవర పెడుతోంది. వలసలు ఆపేందుకు ఎమ్మెల్యే పైలెట్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దీంతో బషీరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చిందనే చెప్పవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి వర్గంలో కొత్త జోష్ వచ్చింది.
ఎమ్మెల్యే సొంత మండలంలో అధికార పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు
హస్తం గూటికి బషీరాబాద్ ఎంపీపీ, జెడ్పీటీసీ
అదే బాటలో పీఏసీఎస్ వైస్ చైర్మన్


కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులతో రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి