ఇంత అన్యాయమా? | - | Sakshi
Sakshi News home page

ఇంత అన్యాయమా?

Nov 27 2026 4:08 AM | Updated on Nov 27 2026 4:08 AM

రేణిగుంట: ‘వైఎస్సార్‌సీపీ హయాంలో కూడా ఇంత అన్యాయంగా వ్యవహరించలేదు’ అని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ ఇన్‌చార్జ్‌ కోట వినుత ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా వినుత తల్లి జయలలిత బరిలో నిలిచారు. గురువారం రేణిగుంట జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్దకు కోట వినుత, కోట చంద్రబాబు చేరుకున్నారు. తమ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించలేదని, ఇదంతా టీడీపీ కుట్ర అంటూ వినుత ఆరోపించారు. చివరికి ఏజెంట్లను అనుమతించారు. స్థానికేతరులనే కారణంతో తమను అడ్డుకుంటున్న పోలీసులు, టీడీపీ నాయకుల్ని ఎలా అనుమతించారంటూ వినుత, చంద్రబాబు వారితో వాదనకు దిగారు. గత ప్రభుత్వంలో కూడా ఇంత అన్యాయం జరగలేదంటూ వినుత వాపోయారు. రేణిగుంటలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రోద్బలంతోనే పోలీసులు తమను అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నట్టు ఆమె ఆరోపించారు.

శాస్త్రోక్తంగా ఆకాశదీపం

శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం ఆకాదీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రతిరోజు ఆకాశదీపాన్ని సంప్రదాయబద్ధంగా వెలిగిస్తుంటారు. ఆలయంలోని ఊంజల్‌సేవ మండపం వద్ద ఏర్పా టు తేసిన కార్తీక దీపానికి పూజలు చేశారు. అనంతరం స్థూపానికి జ్యోతిని అమర్చి ఆకాశదీపంగా ఎగురవేశారు. భక్తులు పెద్ద సంఖ్య లో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేదపండితులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement