వినాయకుడి సేవలో అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

వినాయకుడి సేవలో అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌

Nov 27 2026 4:08 AM | Updated on Nov 27 2026 4:08 AM

కాణిపాకం: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని గురువారం అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ప్రీతారెడ్డి దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద సహాయ కార్యనిర్వహణాధికారి రవీంద్రబాబు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి వీరు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించగా, ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ వాసు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలాజీ నాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement