మంగంపేట మనదే! | - | Sakshi
Sakshi News home page

మంగంపేట మనదే!

Nov 27 2026 4:08 AM | Updated on Nov 27 2026 4:08 AM

594 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పోకూరి సుజాత

అభినందనలతో ముంచెత్తిన

పలువురు నేతలు

ఓబులవారిపల్లె : దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్‌ నడుమ సాగిన రైల్వేకోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లె మండలం, మంగంపేట పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు పోకూరు సుజాత ఘన విజయం సాధించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముగ్గురాయి గనులున్న మంగంపేట పంచాయతీలో గురువారం ఉదయం ఉద్రిక్తతల నడుమ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కూటమి నాయకుల దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మంగంపేట ప్రజలు తీర్పునిచ్చారు. మొత్తం 14 వార్డులకుకుగాను 09 వార్డులు పోకూరి సుజాత మద్దతు అభ్యర్థులు వార్డు మెంబర్లుగా గెలుపొందారు. మంగంపేట పంచాయతీలో మొత్తం నాలుగు వేల ఓట్లు ఉండంగా అందులో 70 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఇందులో పోకూరు సుజాత 594 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన విజయానికి కృషి చేసి గ్రామస్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పోకూరి సుజాతకు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మంగంపేట నాయకులు గుత్తిరెడ్డి హరినాథ్‌రెడ్డి, తల్లం రమణారెడ్డి అభినందనలు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ మద్దతుదారు ఘన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement