● దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

● దుర్మార్గం

Oct 9 2026 1:32 AM | Updated on Oct 9 2026 1:32 AM

తిరుపతి తుడా: రుయా ఆస్పత్రిలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీచేయడం దారుణమని సీఐటీయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం వారు మీడియాతో మట్లాడారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఉద్యోగుల పోరాటాన్ని షోకాజ్‌ నోటీసులతో అణచివేయాలని చూడడం దుర్మార్గమన్నారు. 20 నుంచి 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న సిబ్బంది తమను రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతున్నారని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణం కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు, యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే వేణుగోపాల్‌, నగర అధ్యక్షులు పార్థసారథి, నగర ప్రధాన కార్యదర్శి బుజ్జి పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాల్సిందే

రుయా ఆస్పత్రిలో దాదాపు వెయ్యి మందికి పైగా స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారని, తమ సేవలను గుర్తించకుండా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రుయా ఆస్పత్రి వద్ద మూడవ రోజు పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement