జగనన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు సాగిస్తా తిరుపతి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన అభినయ్‌రెడ్డి
తిరుపతి మంగళం : చిన్నవయసులోనే తనపై నమ్మకంతో అతి పెద్ద బాధ్యతను అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తిరుపతి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన అభినయ్‌రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లాె ఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా గురువారం పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. తిరుపతి జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. తనపై జగనన్న ఉంచిన నమ్మకానికి ఎల్లప్పుడు కృతజ్ఞుడై ఉంటానన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పెద్దల అందరి సహకారంతో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ నిత్యం పోరాటాలు సాగిస్తామన్నారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలోని పార్టీ శ్రేణులతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. జగన్నను తిరిగి ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు అవిశ్రాంత పోరాటం చేస్తానని చెప్పారు.


