● మాకు లేదు సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

● మాకు లేదు సంక్షేమం

Oct 9 2026 1:32 AM | Updated on Oct 9 2026 1:32 AM

మాకు సంక్షేమ పథకాలు లేవా బాబూ..? అంటూ పలువురు భవన నిర్మాణ కార్మికులు ప్రశ్నించారు. ఏపీ బిల్డింగ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌డీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో.. సీఐటీయూ మద్దత్తుతో గురువారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. తర్వాత వారు మాట్లాడుతూ లేబర్‌కార్డుల రెన్యూమల్‌ కేవలం అన్‌లైన్‌లో మాత్రమే ఉందని చెప్పారు. అయితే అందరూ అన్‌లైన్‌లో చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆప్‌లైన్‌ సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, 50 ఏళ్లకు పైబడిన వారికి పింఛన్‌ సౌకర్యం, కార్మికుల పిల్లలకు స్కాలర్‌ షిష్స్‌, పేదలకు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు శ్రీరాములు, నారాయణస్వామి, గణేష్‌, తిరుమలరెడ్డి, మునిశేఖర్‌, రాజశేఖర్‌, బద్రి, రవి, పరమేష్‌ పాల్గొన్నారు. – తిరుపతి అర్బన్‌

64 రుయా వద్ద నిరసన తెలుపుతున్న కాంట్రాక్టు ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement