ఆరోగ్య భద్రత అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య భద్రత అవసరం

Oct 5 2026 12:51 AM | Updated on Oct 5 2026 12:51 AM

తిరుపతి అర్బన్‌: వసతి గృహాల్లోని విద్యార్థులకు ఆరోగ్య భద్రత అవసరమని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతి పద్మావతి అతిథిగృహంలో ఆయన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. దుస్తులు, ఇతర సామగ్రి ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. స్వర్ణ గ్రామ, వార్డు జిల్లా అధికారి విజయలక్ష్మి, అడిషనల్‌ అధికారి జగదీష్‌, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారి యశ్వంత్‌, డీసీఓ పద్మావతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement