సంప్రదాయబద్ధంగా వెంకటగిరి జాతర చాటింపు | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయబద్ధంగా వెంకటగిరి జాతర చాటింపు

Sep 17 2026 2:14 AM | Updated on Sep 17 2026 2:14 AM

వెంకటగిరిరూరల్‌ : వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మతల్లి జాతర మొదటి చాటింపు బుధవారం అర్ధరాత్రి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా కాపాళెంలోని గాలిగంపుల పోలేరమ్మ, కామాక్షమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం జాతరకు చాటింపు వేశారు. కాంపాళెంలోని ప్రధాన మార్గం మీదుగా వరదరాజస్వామి ఆలయం, బజారువీధి మీదుగా పోలేరమ్మతల్లి ఆలయం, ఆర్చి, కాశీపేట కూడలి మీదుగా చాటింపును కొనసాగించారు. శ్రీనివాసులరెడ్డి, సీఐ రోశయ్య పర్యవేక్షించారు.

19న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

తిరుపతి అర్బన్‌: ఇంటర్‌ 2025–26లో 75శాతం మార్కులతో ఉత్తీర్ణులైన నాన్‌ మ్యాథ్స్‌ గ్రూప్‌ విద్యార్థులకు హెస్‌సీఎల్‌ కంపెనీ అసోసియేట్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆర్‌ఈఓ గోపాల్‌రెడ్డి, డీఎస్‌డీఓ లోకనాథం తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుపతిలోని కరకంబాడి మార్గంలో ఉన్న శ్రీరామ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8019913422 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement