శ్రీవారి దర్శనానికి 4 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 4 గంటలు

Sep 17 2026 2:14 AM | Updated on Sep 17 2026 2:14 AM

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,361 మంది స్వామివారిని దర్శించుకోగా 18,722 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 04 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.

ముక్కంటి సేవలో

ప్రిన్సిపల్‌ సెక్రటరీ

శ్రీకాళహస్తి : జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని బుధవారం దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కన్నబాబు సేవించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆయనకు ఆలయ పాలకమండలి చైర్మన్‌ కొట్టే సాయిప్రసాద్‌, ఈఓ బీకే వెంకటేశులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మృత్యుంజయస్వామి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ పరిపాలన భవనంలో చైర్మన్‌, ఈఓతో కలిసి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆలయ నిర్వహణ, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.

జాతర నిర్వహణకు అనుమతి

వెంకటగిరి(సైదాపురం) : గ్రామశక్తి పోలేరమ్మతల్లి జాతరను వైభవంగా నిర్వహించాలని వెంకటగిరి రాజా కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వీబీ సాయికృష్ణ యాచేంద్ర సూచించారు. బుధవారం ఈ మేరకు వెంకటగిరి రాజా ప్యాలెస్‌లోని మండపంలో వెంకటగిరి గ్రూప్‌ దేవస్థానం ఈఓ శ్రీనివాసులరెడ్డి, సీఐ రోశయ్యకు సాయికృష్ణయా చేంద్ర తాంబులం అందించి జాతర నిర్వహణ కు అనుమతి ఇచ్చారు. సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ సాంప్రదాయలను గౌరవిస్తూ ప్రజా ప్రతినిధుల సమక్షంలో దేవదాయ, పోలీ సు, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసు కుని జాతరను విజయవంతం చేయాలని కోరా రు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement