శతాధిక రక్తతరంగం | - | Sakshi
Sakshi News home page

శతాధిక రక్తతరంగం

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

● 113 సార్లు రక్తదానం చేసిన డాక్టర్‌ వేణుగోపాల్‌

– 8లో

– 8లో

విజయవంతంగా గుండె మార్పిడి
పద్మావతి చిన్నపిల్లల కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌ లో శనివారం గుండె మార్పిడి శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతం చేశారు.

చిట్వేలి: ఆయనో శతాధిక రక్త దానం చేసిన గొప్పదాత. ఒకరి ప్రాణాన్ని కాపాడడానికి రక్తమిస్తే ఆ రోగి కుటుంబంలో చిరునవ్వులు పూయిస్తుందని నమ్మాడు. ఈ క్రమంలో 33 ఏళ్లుగా అలుపెరగక రక్తదానం చేస్తున్నాడు. 113సార్లు రక్తదానం చేసిన డాక్టర్‌ దొండ్లవాగు వేణుగోపాల్‌ చిట్వేలి వాసి కావడం మండలానికే గర్వకారణమని చెప్పవచ్చు. తన తల్లికి శస్త్రచికిత్స సమయంలో అవసరమైన రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులు పడిన వేణుగోపాల్‌ ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదన్న కృతనిశ్చయంతో రక్తదానం చేయడం మొదలు పెట్టి.. ప్రతి 90 రోజులకోసారి ఇప్పటివరకు 113 సార్లు రక్తదానం చేశారు. రక్తదానం ఒక సామాజిక బాధ్యత అంటారాయన. రక్తదానం చేయడంతో కుల, మత, ప్రాంతీయ రహిత అసమానతలు లేని సమాజాన్ని నిర్మించవచ్చంటారు. సామాజిక శాస్త్రవేత్తగా సమాజంలో రక్తదానం చేయడంపై యువతలో అవగాహన కల్పిస్తూ తిరుపతి జిల్లాలోని చిట్వేలి మండలాన్ని రక్తదాతల జిల్లాగా మార్చడం వెనుక వేణుగోపాల్‌ సంకల్పం అన్నారు. వందోసారి రక్తదానం చేసిన కార్యక్రమంలో అప్పటి కేంద్ర అసోసియేషన్‌ జస్టిస్‌ ఎంపవర్మెంట్‌ మంత్రి నారాయణస్వామి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. రాష్ట్ర గవర్నర్‌, ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ నుంచి పలుసార్లు పురస్కారాలు పొందారు. హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నె, విశాఖపట్నం, తిరుపతిలోని స్వచ్ఛంద సంస్థలు వేణుగోపాల్‌ రక్తదాన దీక్షను గుర్తించి, సన్మానించారు. వేణుగోపాల్‌ కుటుంబంలోని 14 మంది రక్తదాతలు కావడం విశేషం. తన అన్నయ్యలు డాక్టర్‌ చంద్రశేఖర్‌, శ్రీనివాసుల స్పూర్తితో, సతీమణి రేవతి తోడ్పాటుతో రక్తదానం చేస్తున్నానన్నారు. అమెరికాలోని ఎన్‌ఏటీఎస్‌ సంస్థ–2025లో ప్లోరిడా, టాంపలో నిర్వహించిన వేడుకలకు ఆహ్వానించడం, భారతి విశ్వ విద్యాలయం డాక్టర్‌ వేణుగోపాల్‌ 113 సార్లు రక్తదానం చేయడం, రక్తదానస్పూర్తిని పెంచడాన్ని గుర్తించి గౌరవ డాక్టరేట్‌ని ప్రదానం చేయడం తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. తన జీవితాతం రక్తదానాన్ని కొనసాగిస్తానని డాక్టర్‌ వేణుగోపాల్‌ అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement