తిరుపతి కల్చరల్: భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ పరిధిలోని హిందీ సలహా కమిటీ సభ్యుడిగా తిరుపతికి చెందిన డాక్టర్ పీసీ రాయులను నామినేట్ చేస్తూ శనివారం భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈయన గతంలో ఎఫ్‌సీఐ, ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ, బొగ్గు, ఉక్కు పరిశ్రమలు వంటి చట్టబద్ధమైన సంస్థల్లో సభ్యునిగా పని చేశారు. ఆయన మూడేళ్ల కాల వ్యవధి గల ఈ హిందీ సలహా కమిటీ సభ్యుడుగా కొనసాగనున్నారు.


