సైదాపురం: మండలంలోని చాగణం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి మంగళవారం రాత్రి నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. దీంతో బుధవారం అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, కుటుంబ సభ్యులు కథనం మేరకు.. సైదాపురం మండలంలోని చాగణం గ్రామానికి చెందిన బంకాపూరి సుబ్బయ్య కుమారుడు మణికంఠ గూడూరులోని ఓప్రైవేట్ కళాశాల్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి బైక్‌ను తీసుకుని సమీపంలోనే అంజనేయ స్వామి గుడి వద్దకు వెళ్లి వస్తానని చెప్పాడు. రాత్రి గడుస్తున్నా మణికంఠ రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ విషయమై ఎస్‌ఐ క్రాంతికుమార్ మర్లపూడి సమీపంలోని తెలుగు గంగ ప్రధాన కాలువ వద్ద బైక్ మాత్రమే ఉండడంతో గంగ కాలువలో అన్వేషణ చేశారు. కానీ కనిపించలేదు. గంగ కాలువ వద్ద ఉన్న సీసీ కెమెరాలు ఆ సమయంలోనే పనిచేయకపోవడంతో మరింత అనుమానాలకు తావ్విస్తోంది.


