తిరుపతి సిటీ: జిల్లాలో గత నెల 23వ తేదీ నుంచి జరిగిన ఇంటర్ పరీక్షలు బుధవారంతో ముగిశా యి. చివరిరోజున ఇంటర్ సెకండ్ ఇయర్ కెమెస్ట్రీ పేపర్–2 పరీక్షకు 24,332 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 23,999 మంది హాజరయ్యారని, 333 మంది గైర్హాజరైట్లు ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారంతో ఫస్ట్ ఇయ ర్ పరీక్షలు పూర్తి కాగా, బుధవారంతో సెకండ్ ఇయర్ పరీక్షలు సైతం పూర్తి అయినట్లు తెలిపా రు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని, పరీక్షలు సజావుగా జరిగేందుకు సహకరించిన జిల్లా అన్ని శాఖల అధికారులు, ఇంటర్మీడియట్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బందికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటికే ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వచ్చేనెల రెండో వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
దివ్యాంగశక్తి పథకం ప్రారంభం
తిరుపతి అన్నమయ్యసర్కిల్:జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని అలిపిరి ఆర్టీసీ డిపోలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. ముందుగా నిర్వహించిన సమావేశంలో దివ్యాంగు లను ఉద్దేశించి అతిథులు ప్రసంగించారు. అ నంతరం రెండు బస్సులో దివ్యాంగులతో క లసి వేర్వేరు మార్గాల్లో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో డీపీటీఓ జగదీష్, డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్, బాలాజీ, అలిపిరి డిపో మేనేజర్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
క్వాంటమ్ టెక్నాలజీలో ఎస్వీయూ కీలక ప్రాత పోషించాలి
తిరుపతి సిటీ: వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ టెక్నాలజీకి దోహదపడేలా ఎస్వీయూ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పిలుపునిచ్చారు. బుధవారం ఎస్వీయూ వీసీ చాంబర్‌లో ఆయన క్వాంటమ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలపై అధికారులతో పలు అంశాలపై చర్చించా రు. వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ వ్యవస్థకు దోహదపడేలా విద్యార్థులను, పరిశోధకులను, అధ్యాపకులను సిద్ధం చేయడంలో ఎస్వీయూ కీలక పాత్ర పోషించగలదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వీసీ టాటా నర్సింగరావు, రెక్టార్ అప్పారావు పాల్గొన్నారు.
గుర్తు తెలియని యువకుడి మృతి
సత్యవేడు: మండలంలోని పెద్ద ఈటిపాకం గ్రామానికి సమీపంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెంది ఉన్నట్లు బుధవారం స్థానికులు గుర్తించారు. యువకుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్ల లోపు ఉంటుంది. పెద్ద ఈటిపాకం వద్ద ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్న చింత చెట్టుకు ద్విచక్రవాహనం ఢీ కొని యువకుడు అక్కడే ఉన్న గుంతలో కింద పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్ధానికులు చెబుతున్నారు.
ఎరచ్రందనం కేసులో
ఇద్దరికి ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎరచ్రందనం చెట్లను నరికిన కేసులో ఇద్దరికీ ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.6 లక్షలు జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. ఎరచ్రందనం అక్రమ రవాణా నిరోధక దళం 2017లో శేషాచలం, నాగపట్ల ఈస్ట్ బీట్, చామల రేంజ్, ఎరగ్రుట్ట అటవీ ప్రాంతంలో తనిఖీలు చేశారు. తమిళనాడు, క్రిష్ణగిరి జిల్లా ఇస్లాంనగర్‌కు చెందిన సాదిక్ బాషా, గణేషన్ మురుగన్ ఎరచ్రందనం చెట్లను నరికి తొమ్మిది దుంగలుగా మార్చి తరలిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 326 కిలోల తొమ్మిది ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరిపై నేరం రు జువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 70,002 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,738 మంది భ క్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది.


