తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో కార్మికులు చేపట్టిన న్యాయపోరాటం 19వ రోజుకు చేరుకుంది. యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ కార్మికులు మంగళవారం కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని, చేతులకు దారాలను బేడీల్లా చుట్టుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు కే వేణుగోపాల్, స్విమ్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి రవి, గోపి మాట్లాడుతూ 19 రోజులుగా కార్మికులు రోడ్లపై కూర్చుని దీక్షలు చేస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రాణాలకు తెగించి రోగులకు సేవలు అందిస్తున్న కార్మికులపై కనికరం లేకుండా వ్యవహరించడం తగద ని విమర్శించారు. శాంతియుతంగా పోరాడుతు న్న కార్మికులను నిర్బంధాలతో అణచివేయాలని చూడటం సరైన పద్ధతి కాదని హితువు పలికా రు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సూరి, మారిముత్తు, జనార్ధన్, రాజా, వెంకటేష్, నాగభూషణమ్మ, బాలకృష్ణ, నిషా మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.


