కారు బోల్తా.. ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. ఒకరి మృతి

Mar 18 2026 7:37 AM | Updated on Mar 18 2026 7:37 AM

చంద్రగిరి: ప్రమాదవశాత్తు కారు బోల్తాపడడంతో ఒక రు మృతి చెందగా మరొకరు గాయాలపాలైన ఘటన మంగళవారం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..చిత్తూరు జిల్లా బంగారుపాళేనికి చెందిన నరేంద్రనాయుడు (51), తన అక్క కొ డుకు సురేంద్ర నాయుడితో కలసి వ్యక్తిగత పనులపై కారులో తిరుపతికి బయలుదేరారు. పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారి, కోట సమీపంలో వస్తుండగా కారు బోల్తా పడింది. దీంతో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికి త్స పొందుతూ నరేంద్ర నాయుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సురేంద్ర నాయుడు చేతికి గాయం అయ్యిందని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement