బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని నెలవాయి గ్రామానికి చెందిన మురళికి సంబంధించిన గడ్డివామిని ఇదే గ్రామానికి చెందిన మణి ఆదివారం అర్ధరాత్రి నిప్పుపెట్టి దగ్ధం చేశాడని ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. మురళి సంబంధించిన 1200 మోపుల గడ్డి వామిని పాత గొడవలుండడంతో మణి నిప్పుపెట్టాడని, దీంతో మురళికి సుమారు రూ.1.20 లక్షల నష్టం వట్టిలిందన్నారు. శ్రీకాళహస్తి నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసిన గడ్డి కాలి బుడిద అయ్యింది. మురళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.


