పింఛన్లు ఇప్పించండి మహాప్రభో! | - | Sakshi
Sakshi News home page

పింఛన్లు ఇప్పించండి మహాప్రభో!

Mar 17 2026 7:23 AM | Updated on Mar 17 2026 7:23 AM

జీతాలు ఇవ్వాలంటూ పారిశుద్ధ్య

కార్మికుల నిరసన

గ్రీవెన్స్‌కు 352 అర్జీలు

తిరుపతి అర్బన్‌: పింఛన్‌ ఇప్పించండి మహాప్రభో అంటూ పలువురు పేదలు సోమవారం కలెక్టరేట్‌కు విచ్చేశారు. అయితే అనుమతులు రావాలంటూ అధికారులు బదులిచ్చారు. ఎప్పుడు అనుమతులు వస్తాయంటూ పలువురు దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 352 అర్జీలు వచ్చాయి. జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్‌నాయక్‌, రోజ్‌మాండ్‌ అర్జీలను అందుకున్నారు. గ్రీవెన్స్‌కు 352 అర్జీలు వచ్చాయి. అందులో ప్రధానంగా రెవెన్యూ సమస్యలపై 232 అర్జీలు, పంచాయతీరాజ్‌ 16, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 11, డీఆర్‌డీఏకు 19 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు.

పాలకేంద్రాన్ని మా మండలంలోనే ఉంచండి

వరదయ్యపాళెం మండలంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలకేంద్రానికి ప్రతి రోజు సుమారుగా 2 వేల మంది పాడి రైతులు 1500 లీటర్లు పాలుపోస్తున్నామని పాడి రైతులు తెలిపారు. వరదయ్యపాళెం పాల కేంద్రాన్ని బుచ్చినాయుడుకండ్రిగకు మార్పు చేస్తామని చెబుతున్నారని, ఆ కేంద్రాన్ని మా మండల కేంద్రంలోనే ఉంచాలని వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదు

నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న తమకు ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదని పారిశుద్ధ్య కాార్మికులు వాపోయారు. అధికారులకు చెప్పినా ఏజెన్సీ వారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.

లీలావతి,

వ్యాధిగ్రస్తురాలు,

నాగలాపురం

పాలకేంద్రాన్ని తరలించవద్దు

అంటున్న పాడిరైతులు

పింఛన్‌ ఇప్పించండి

నా ఆరోగ్యం సరిలేదు. మంచానికే పరిమితం అయ్యాను. మేము నాగాలాపురం మండల కేంద్రంలో కాపురం ఉంటున్నాం. బతకడం కష్టంగా మారుతుంది. పింఛన్‌ ఇప్పిస్తే ఆ డబ్బులతోనే నా జీవనం సాగిస్తాం. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. తమకు న్యాయం చేయాలంటూ లీలావతి అనే మహిళ సోమవారం కలెక్టరేట్‌లో అధికారులుకు వినతిపత్రం అందజేశారు.

వంద శాతం వైకల్యం ఉంది

తన కుమారుడు ఆవుల చంటికి వందశాతం వైకల్యం ఉందని తల్లి సునీత వెల్లడించారు. మంచానికే పరిమితం అయ్యారని చెప్పారు. పేద కుటుంబానికి చెందిన తమకు ఇచ్చే రూ.6వేలు పింఛన్‌ వైద్య ఖర్చులు, మందులకే సరిపోవడం లేదన్నారు. రూ.15వేలు పింఛన్‌ ఇప్పిచాలని వేడుకున్నారు. న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement