మత్తు, మగువలతో జోగుతున్న కూటమి నేతలు | - | Sakshi
Sakshi News home page

మత్తు, మగువలతో జోగుతున్న కూటమి నేతలు

Mar 17 2026 7:23 AM | Updated on Mar 17 2026 7:23 AM

● డగ్ర్స్‌ కేసులో పట్టుబడిన టీటీడీ ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్‌ ● కూటమి పాలనలో ఏరులైపారుతున్న మద్యం, మత్తు పదార్థాలు ● కామక్రోద్రిక్తుడైన బీఆర్‌ నాయుడిపై చర్యలేవీ? ● చంద్రబాబు తీరుపై భూమన అభినయ్‌రెడ్డి ఆగ్రహం

తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం, అభివృద్ధిని పక్కన పెట్టి మత్తు పదార్థాలు, మగువలతో కూటమి నేతలు జోగుతున్నారని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తిరు పతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఏలూరు టీడీ పీ ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులకు పట్టుబడ్డారన్నారు. అయితే ఆ కేసును నీరుగార్చేందుకు తన ఆత్మీయ సన్నిహితుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని చంద్రబాబు రంగంలోకి దింపారన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో మత్తు పదార్థాలు విచ్చలవిడిగా సాగుతోందంటూ చంద్రబాబు దుష్పచారాలు చేశారన్నారు. అయితే తాము అధికారంలోకి రాగానే మత్తు పదార్థాలు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఈరోజు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడంలో చంద్రబాబుకు మించినవారులేరన్నారు.

రాసలీలలు ప్రేరేపిస్తున్నారా బాబూ?

మత్తుపదార్థాలు సేవించి తూలుతూ, మహిళలపై వేధింపులు, మగువలతో రాసలీలలు సాగిస్తూ ప్రత్యక్షంగా దొరికిన కూటమి నేతలపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని భూమన అభినయ్‌ ప్రశ్నించారు. మత్తు, మగువలతో రాసలీలలను చంద్రబాబు ప్రేరేపిస్తున్నారా? లేక తమ కూటమి నేతలని సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు హయాంలో తిరుమలలోని క్యూలో భక్తులు నిరసనలు చేపట్టిన చరిత్ర ఎప్పుడూ లేదన్నారు. బీఆర్‌ నాయుడు తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నామన్న కక్షతో తమపై టీవీ5 చానల్‌లో గ్యాస్‌ నిల్వలు ఉంచామంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని, అయితే మా కుటుంబసభ్యులెవరికీ గ్యాస్‌ ఏజెన్సీలు లేవన్న విషయాన్ని తెలుసుకో బీఆర్‌ నాయుడు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా చంద్రబాబు టీడీపీ ఎంపీ మహేష్‌యాదవ్‌, టీటీడీ చైర్మెన్‌ బిఆర్‌. నాయుడులను వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement