పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శం

Mar 17 2026 7:23 AM | Updated on Mar 17 2026 7:23 AM

తిరుపతి క్రైం : ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శప్రాయమని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన ఎస్పీ, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. యువత ఆయన సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, శ్రీనివాసులు, డీఎస్పీ చంద్రశేఖర్‌, ఏవో సురేష్‌ కుమార్‌, సీఐలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

అడవిలో కార్చిచ్చు

రేణిగుంట:మండలంలోని వెంకటాపురం ఎదురుగా ఉన్న శేషాచల అడవుల్లో సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఆదివారం ఇదే ప్రాంతానికి సమీపంలో మంటలు వ్యాప్తి చెందడంతో అటవీశాఖ సిబ్బంది అదుపులోకి తెచ్చారు.

కాలుతున్న శేషాచలం అడవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement