– 10 మందికి సేవా పతకాలు.. ఒకరికి ఉత్తమ సేవా పతకం
తిరుపతి క్రైం : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే సేవాపతకాలు, ఉత్తమ సేవాపతకాలు ఈ ఏడాది తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు లభించాయి. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ గుర్తింపు రావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు చెందిన 10 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి సేవా పతకాలు, ఒకరికి ఉత్తమ సేవా పతకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డులు అందుకోవడం జిల్లా పోలీస్ శాఖకు గౌరవకారణమని ఎస్పీ తెలిపారు. పతకాలు పొందిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అభినందించారు.
శేఖర్‌కు ఉత్తమ సేవాపతకం
ఎన్. శేఖర్ (ఏఎస్‌ఐ 598–డీఎస్‌బీ, తిరుపతి)కు ఉత్తమ సేవా పతకం లభించింది.


