ఐదు రోజులుగా బిడ్డ ఆచూకీ లేదు! | - | Sakshi
Sakshi News home page

ఐదు రోజులుగా బిడ్డ ఆచూకీ లేదు!

Mar 17 2026 7:23 AM | Updated on Mar 17 2026 7:23 AM

తిరుపతి రూరల్‌: ఐదు రోజులుగా తన బిడ్డ ఆచూకీ లభించకపోవడంతో ఓ తల్లి ఆవేదనను వ్యక్తం చేస్తోంది. తిరుపతి రూరల్‌ మండలం మల్లంగుంట సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ ఫస్టు ఇయర్‌ చదువుతున్న జశ్వంత్‌రెడ్డి ఐదు రోజులు కిందట కాలేజీ ప్ర హరీ గోడ దూకి పరారయ్యాడు. ఆ విషయం గుర్తించి న కాలేజీ యాజమాన్యం ఆ యువకుని తల్లిదండ్రుల కు సమాచారం అందించగా వారు కాలేజీకి వచ్చి మూ డు రోజులుగా తన బిడ్డ ఆచూకీ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆ అబ్బాయి తల్లి లక్ష్మీదేవి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతి రూరల్‌, తిరుచానూరు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా రు. కాగా కాలేజీలో అందరితో సరదాగా గడిపే జశ్వంత్‌రెడ్డి ఇప్పటి వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ అన్ని పరీక్షలు బాగానే రాసినట్టుగా చెప్పుకున్నా ఎందుకు పరా రైనట్టు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాలేజీ వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాలు

ఐదు రోజులుగా ఓ అబ్బాయి కనిపించకపోవడంతో విద్యార్థి సంఘాల నేతలు ఆ కాలేజీ వద్దకు చేరుకోవడంతో పోలీసులు మోహరించారు. విద్యార్థి సంఘం నేతలను వెంట బెట్టుకుని కాలేజీ లోపలకు వెళ్లి అసలు ఏం జరిగిందన్న విషయం కాలేజీ యా జమాన్యం ద్వారా చెప్పించారు. కాగా మంగళవా రం జరిగే ఆఖరి పరీక్షకు అతను హాజరుకాకుంటే ఆ తరువాత గాలింపు చర్యలను వేగవంతం చేస్తామని పోలీసులు చెబుతున్నారు. వారిలో వైఎస్సార్‌ సీపీ విద్యార్థి సంఘం నేతలు ఓబుల్‌రెడ్డి, యశ్వంత్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, ఏపీ స్టూడెంట్స్‌ జేఏసీ జల్లా అధ్యక్షులు శ్రీధర్‌, జ్యోతిప్రకాష్‌లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement