వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో గడప వద్దకే వైద్యాన్ని అందించారు. ఈ కాన్సెప్ట్‌లో గ్రామాల్లో 14 రకాల వైద్య పరీక్షలు జరిపి 105 రకాల మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ప్రస్తుతం సేవలు దూరం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సేవలు రోగులకు దూరమయ్యాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవస్థలు నిర్వీర్యం చేసి అధికారులను సర్వేల పేరుతో గ్రామాల్లో తిప్పడంతో ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ కుర్చీలతో దర్శన మిస్తోంది.


