తిరుపతి సిటీ : తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్‌లో ఆదివారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎంపికలో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలలోని 22 పాలిటెక్నిక్‌లకు చెందిన ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం డిప్లొమో విద్యార్థులు 300 మంది పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ రైల్యే ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రగామి సంస్థ మేధా సర్వే వారు క్యాంపస్ డ్రైవ్ చేపట్టి విద్యార్థులకు ఉద్యోగవకాశాలు కల్పించండం అభినందనీయమన్నారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష నిర్వహించారని తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 50 మంది విద్యార్థులు రెండో దశ పర్సనల్ ఇంటర్వ్యూకు సెలక్ట్ అయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల తుది జాబితాను వచ్చే వారం అధికారికంగా ప్రకటిస్తా మని వెల్లడించారు. ఈఈఈ విభాగాధిపతి జీఎస్ రాధ, ఫార్మసీ హెడ్ హరీష్ బాబు పాల్గొన్నారు.


