చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం వైభవంగా పుష్పయాగ మహో త్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవదేవేరులకు స్నపన తిరుమంజనం జరిపించారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో కనులపండువగా పుష్పయాగం చేపట్టారు. యాగానికి 4 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, గార్డెన్ మేనేజర్ జనార్ధన్ రెడ్డి, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, అర్చకుడు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్ పాల్గొన్నారు.


