తిరుపతి రూరల్: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూ నివర్సిటీ వారి ఆధ్వర్యంలో చైన్నెలోని సత్యభామ యూనివర్సిటీలో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన జాతీయస్థాయి నృత్య కళల పోటీల్లో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు ప్రతిభ చాటారు. మైమ్ విభాగంలో తెలుగు విభాగానికి చెందిన ప్రత్యూష, ప్రనూష, ఎల్‌ఎల్‌బీకి చెందిన మీనా, భానుశ్రీ, బీటెక్ విద్యార్థినులు త్రివేణి, తేజశ్రీ, కావ్యలకు రెండో బహుమతి లభించగా, రంగోలీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న కె.యామిని నాలుగో బహుమతి కై వసం చేసుకున్నా రు. ఆ మేరకు యూనివర్సిటీ కల్చరల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఆర్‌ఎన్‌ఎస్ శైలేశ్వరీతో పాటు విద్యార్థినులను వైస్ చాన్సలర్ వి ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఉషా అభినందించారు.


