ఇద్దరు తమిళ స్మగ్లర్ల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు తమిళ స్మగ్లర్ల అరెస్టు

Mar 14 2026 7:21 AM | Updated on Mar 14 2026 7:21 AM

క్వారీ బ్లాస్టింగ్‌ బీభత్సం

భాకరాపేట: ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరు తమిళ స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు అటవీశాఖాధికారులు తెలిపారు. చిన్నగొట్టిగల్లు మండలంంలో ఎర్రచందనం అక్రమ రవాణా యత్నాన్ని అటవీ శాఖ అధికారులు భగ్నం చేశారు. అటవీక్షేత్రాధికారి ఎన్‌. వెంకటరమణం ఆధ్వర్యంలో డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ ఆర్‌.ఎస్‌. చైతన్య, ప్ర త్యేక బృందం సభ్యులు భాకరాపేట రేంజ్‌ పరిధిలోని బోడేవాండ్లపల్లి అటవీ ప్రాంతంలో గు రువారం రాత్రి కూంబింగ్‌ చేపట్టారు. ఆ సమయంలో అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తమిళనాడుకు చెందిన స్మగ్లర్లని అధికారులు గుర్తించారు. వారి వద్ద నుంచి 238 కిలోలు బరువు ఉన్న 16 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఉపయోగించిన వాహనాన్ని కూడా అధికారులు సీజ్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషనన్‌లో డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ ఆర్‌ఎస్‌ చైతన్య, ఎఫ్‌బీఓలు వై.రాజేష్‌ కుమార్‌, జి. ప్రదీప్‌ చంద్ర, జేబీ నిఖిల్‌, ఎం. సదాశివయ్య, సి.రవి, డ్రైవర్‌ తేజా తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు వేయాలని సెల్‌ టవర్‌ ఎక్కిన యువకుడు

పాకాల: మండలంలోని చిన్నగోర్పాడు గ్రామాని కి చెందిన సురేష్‌నాయుడు అనే యువకుడు తమ గ్రామంలో సీసీ రోడ్డు వేయాలని సెల్‌ టవర్‌ ఎక్కి న ఘటన శుక్రవా రం చోటు చేసుకుంది. స్థానికు లు కథనం మేరకు.. చిన్నగోర్పాడులో చాలాకాలంగా సీసీ రోడ్డు లేదు. స్థానికులు తీవ్రంగా ఇబ్బదులు పడుతున్నారు. విరక్తి చెందిన యువకుడు సురేష్‌నాయుడు సెల్‌ టవర్‌ ఎక్కి తన నిరసనను తెలి పాడు. మండల పర్యటనలో ఉన్న స్థానిక ఎమ్మె ల్యే పులివర్తి నాని విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడంతో సురేష్‌నాయుడు సెల్‌ టవర్‌ దిగి వచ్చాడు.

చంద్రగిరి: మండలంలోని రెడ్డివారిపల్లి సమీపంలో ఉన్న క్వారీలో గురువారం జరిపిన భారీ పేలుళ్ల (బ్లాస్టింగ్‌) కారణంగా పెను ప్రమాదం సంభవించింది. బ్లాస్టింగ్‌ ధాటికి కొండపై నుంచి ఒక భారీ బండరాయి వేగంగా దొర్లుకుంటూ వచ్చి చంద్రగిరి – నాగయ్యగారిపల్లి ప్రధాన రహదారిపై పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కొండ పైనుంచి పడిన భారీ బండరాయి రోడ్డుపై పడగానే మూడు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో రాయి రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, బాటసారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తృటిలో ప్రాణా పాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్వారీలపై అధికారులు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement