నాయుడుపేట టౌన్: సీఎం చంద్రబాబు ఈ నెల 17వ తేదీన నాయుడుపేటలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అధికారులతో కలిసి సీఎం పర్యటించే ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. సీఎం చంద్రబాబు 17వ తేదీన మండలంలోని బిరదవాడ సమీపంలో ఉన్న టిడ్కో గృహ సముదాలను ఉగాదిని పురస్కరించుకుని ముందస్తుగా ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే పక్కాగృహ నిర్మాణాలు చేసుకుని ఉన్న లబ్ధిదారులకు సంబంధించి పక్కాగృహ నిర్మాణాల గృహ ప్రవేశాలు చంద్రబాబు చేతుల మీదుగా చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలోని సీఎస్ తేజ సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన దివంగత సీఎం ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, అడిషనల్ ఎస్పీ రవి మనోహర ఆచారి, డీఎస్పీ చెంచుబాబు, ఆర్డీఓ దేవేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


