న్యూస్‌రీల్
ఓ సంఘం పేరుతో దందా షాపు రిజిస్ట్రేషన్ లేకుంటే ఆ సంఘం నేత అనుమతి తప్పనిసరి మందులు, మాత్రలు సైతం ఆ నేత వద్దే కొనాలని హుకుం నెలనెలా మామూళ్లు... అధికారుల పేరిట వసూళ్లు తానే పెద్ద అంటూ పెత్తనం
తిరుపతి అర్బన్: దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉపకరణాలను ఉచితంగా పంపిణీ కోసం బుధవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు శిబిరాలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధులు సంక్షేమశాఖ సహాయ సంచాలకులు బి.వినోద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చే శారు. ఈ నెల 11వ తేదీన సూళ్లూరుపేట, దొర వారిసత్రం, తడ మండలాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. అలాగే చివరిగా ఈ నెల 16న తిరుపతి అర్బన్ మండలంలో దివ్యాంగులకు తుడా గ్రౌండ్, అదే రోజు తిరుపతి రూరల్ మండలంలోని వారికి తిరుపతిలోని గిరిజన భవనంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూ డీడీఈ పరిధిలో గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన తృతీయ సంవత్సరం డిగ్రీ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను మంగళవారం విడుదల చేసినట్లు డీన్ ప్రొఫెసర్ సురేంద్రబాబు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పీజీ రెగ్యులర్ కోర్సులకు సంబంధించిన సెకండ్ సెమిస్టర్ ఫలితాలను సైతం విడుదల చేశామన్నారు. ఫలితాల కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 72,526 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,664 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.41 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శ న టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
ఫిజిక్స్ పర్లేదనిపించింది!
తిరుపతి సిటీ: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా నూతన సిలబస్‌తో మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజక్స్ పేపర్–1 ప్రశ్నపత్రం క్లిష్టతరంగా లేదని, పేపర్ పర్లేదనిపించిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. 1, 2మార్కుల ప్రశ్నలు బేసిక్‌పై ఎక్కువగా అడిగారని, 4, 8 మార్కుల ప్రశ్నలు చాలా వరకు తికమక పెట్టకుండా నేరుగా సంధించారని, సాధారణ విద్యార్థి సైతం మంచి మార్కులు స్కోర్ చేసేందుకు అవకాశం ఉందని అధ్యాపకులు విశ్లేషించారు. ప్రశ్నలు ఎక్కువగా సమస్యాత్మకంగా ఇవ్వకుండా విద్యార్థులు జవాబు రాయగలగేలా ఇచ్చారని వెల్లడించారు. జిల్లాలో 84 పరీక్ష కేంద్రాల్లో 24,736 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 24,307 మంది హాజరయ్యారని, 429 మంది గైర్హాజరయ్యారని ఆర్‌ఐఓ తెలిపారు. బుధవారం సెంకడ్ ఇయర్ విద్యార్థులకు కామర్స్ పేపర్–2 పరీక్ష జరగనుంది.
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026
..చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మచ్చుకు ఈ రెండు మెడికల్ షాపులు మాత్రమే కాదు.. ఇలాంటివి కోకొల్లలు. మెడికల్ సంఘం పేరుతో కొందరు దందాకు తెరలేపుతున్నారు. వారి అనుమతి ఉంటే చాలు.. మెడికల్ షాపులకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఆ నేతలకు మామూళ్లు ఇస్తే చాలు ఎన్నాళ్లయినా షాపులు నడుపుకోవచ్చు. ఏ మందులైనా విక్రయించుకోవచ్చు. అయితే వారు సూచించిన ఏజెంట్ల వద్దే మందులు, మాత్రలు కొనుగోలు చేయాలి. వారు అడిగినప్పుడు మామూళ్లు ఇచ్చుకోవాలి. లేదంటే దాడులు చేయించడం.. షాపులు సీజ్ చేయించడం.. షరామామూలే. మెడికల్ మాఫియా దందాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి ప్రాంతంలో ఓ మెడికల్ షాపునకు అనుమతి లేదు. విచ్చలవిడిగా మందులు, మాత్రలు విక్రయిస్తున్నారు. ఈ షాపులో రోజుకు రూ.లక్ష వరకు వ్యాపారం జరుగుతున్నట్టు సమాచారం. ఆ షాపుపై ఫిర్యాదులు వస్తున్నా అధికారులు మౌనముద్రలో మునిగిపోయారు. ఓ సంఘ నేత అండదండలతో ఈ షాపు నడుస్తోందని డ్రగ్స్ అసోసియేషన్‌లో మరో నేత విమర్శిస్తున్నారు.
తిరుపతి ఎంఆర్‌పల్లిలో రెండు మెడికల్‌షాపులకు రిజిస్ట్రేషన్ లేదు. ఏళ్లతరబడి రిజిస్ట్రేషన్ లేకుండానే ఈ షాపును నడిపిస్తున్నారు. ఓ సంఘ పెద్ద పేరు చెప్పుకుంటూ ఈ షాపును నడిపిస్తున్నారు. అబార్షన్ కిట్లు అడిగిన వాళ్లకు అధిక రేట్లకు విక్రయించేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే విద్యాసంవత్సరానికి కేవలం మూడు నెలలే ఉంది.. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, షూలు, అభ్యసన సామగ్రి అందించాల్సి ఉంది. అందుకు విద్యార్థులు వివరాలు సేకరించాల్సి ఉంది. అయితే ఆ విధులు నిర్వహించే ఉద్యోగుల పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు వచ్చే ఏడాది ప్రభుత్వం నుంచి అందాల్సిన వన్నీ అందకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విద్యాభ్యసన సామగ్రిని మనం కొనుగోలు చేయాల్సిందేనా? అని పేద విద్యార్థుల తల్లిదండ్రులు మదన పడుతున్నారు.
కలెక్టరేట్‌లోని సమగ్రశిక్ష జిల్లా
కార్యాలయం
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విచ్చలవిడిగా మెడికల్ షాపులు
గరుడ వారధిపై ద్విచక్ర, భారీ వాహనాలు నిషేధం
తిరుపతి క్రైం : నగరంలోని గరుడవారధిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజల భద్రత దృష్ట్యా ఇకపై గరుడ వారధిపై ద్విచక్ర వాహనాలు, భారీ రవాణావాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరుపతి స్మార్ట్ సిటీ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం జూమ్ మీటింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర అభివృద్ధి అంశాలతో పాటు గరుడ వారధిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా చర్చించారు. గరుడ వారధి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల వివరాలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. అందులో ఎక్కువ శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల కారణంగా జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని వారధిపై ద్విచక్ర వాహనాలు, భారీ ట్రాన్‌న్స్‌పోర్ట్ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భద్రత కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


