పాట్లు తప్పవా?
పక్షుల పండుగ సమయంలో విహంగాలను వీక్షించేందుకు ఒక్కసారిగా వేల సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి రావడంతో ప్రతిసారీ డీవీ సత్రం నుంచి పక్షుల కేంద్రం ప్రధాన గేట్ల వరకు ట్రాఫిక్ స్తంభించిపోతుంది.
పక్షుల కేంద్రంలో అరకొరగా మరుగుదొడ్లు ఏర్పాటుతో మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు.
కేంద్రం పరిధిలో అన్నిచోట్ల మట్టి రోడ్లు ఉండడంతో గాలికి మట్టి, దుమ్ము లేస్తున్నందున సందర్శకులు ఇబ్బందులు పడాల్సివస్తుంది.
చెరువు కట్టపై ఉన్న వ్యూ పాయింట్లు వద్ద సందర్శకుల సౌకర్యార్థం నాణ్యమైన బైనోక్యూలర్లు అధికం మొత్తంలో ఏర్పాటు చేయక ఇక్కటుపడాల్సివస్తోంది.
పక్షుల ప్రాధాన్యత, వాటి అవశ్యకతను పర్యాటకులకు వివరించేందుకు నేచర్ గైడ్స్, వన్యప్రాణి సిబ్బందిని నియమించాలి ఉంది.
కేంద్రానికి విచ్చేసే సందర్శకులు కోతుల కారణంగా ఇబ్బందులు పడకుండా కోతులను పట్టించాలి.
సూళ్లూరుపేట నుంచి పక్షుల కేంద్రానికి ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలి.
అందరికి ఆకట్టుకునేలా పక్షుల కేంద్రంలో ప్రదర్శలు కల్పించాలి.
సందర్శకులకు
దొరవారిసత్రం : రాష్ట్ర ప్రభుత్వం సూళ్లూరుపేట కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పక్షుల పండుగ ఏర్పాట్లను అధికారులు నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో అరకొరగా చేసి, చేతులు దులుపుకున్నారు. పక్షుల పండుగ ఏర్పాట్లపై జిల్లాధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులు నెల రోజుల ముందు నుంచే సమీక్షలు, సమావేశాలు నిర్వహించినా కనీస వసతులు లేకపోవడం పరిపాటిగా మారింది.
కేంద్రంలో మొదలైన ఏర్పాట్లు
ఈ నెల 10,11 తేదీల్లో పక్షుల పండుగ సందర్భంగా నేలపట్టు పక్షుల కేంద్రంలో, డీవీ సత్రం నుంచి కేంద్రం గేట్లు వరకు స్థానిక అధికారులు పారిశుద్ధ్య పనులు, చెత్తాచెదారం తొలగించడం తదితర పనులు గ్రామ సచివాలయం సిబ్బంది ద్వారా చేయించాల్సిన పనులు బుధవారం నుంచి మొదలయ్యాయి. వన్యప్రాణి విభాగం అధికారులు చెరువు కట్టపై పారిశుద్ధ్యం మెరుగు పరిచే పనులు చేయిస్తున్నారు. అందరినీ ఆకట్టుకునేలా ఇప్పటికే పక్షుల కేంద్రం మార్గం మధ్యలోని హోర్డింగ్‌లకు రంగులు వేయించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సౌకర్యార్థం కేంద్రానికి సమీపంలోని పెలికాన్ అతిథి గృహాలను సిద్ధం చేసే పనులు టూరిజం శాఖ చేపట్టింది.
పండుగ అక్కడే... అందరి చూపు ఇక్కడ!
సూళ్లూరుపేట కేంద్రంగా జిల్లా యంత్రాంగం పక్షుల పండుగ రెండు పాటు నిర్వహించినప్పటికీ అందరి చూపు మాత్రం నేలపట్టు పక్షుల కేంద్రం వైపే. గత ఏడాది మూడు రోజులు పాటు నిర్వహించిన పక్షుల పండుగ సందర్భంగా కేంద్రంలోని విదేశీ వలస విహంగాలను వీక్షించేందుకు 70 వేలు మందికి పైగా సందర్శకుల విచ్చేశారు. ఈ సారి కూడా రెండు రోజుల పాటు జరిగే పండుగకు 50 వేలమంది పైగా సందర్శకులు పక్షుల కేంద్రానికి విచ్చేసే అవకాశం ఉందని స్థానిక వన్యప్రాణి విభాగం అధికారులు పేర్కొంటున్నారు.
నెరవేరని కలెక్టర్ హామీలు
గత ఏడాది జనవరితో పక్షుల పండుగ ఏర్పాట్లు సమయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ నేలపట్టు పక్షుల కేంద్రానికి విచ్చేసి పక్షుల కేంద్రానికి సమీపంలో టూరి జం సముదాయం, డీవీ సత్రంలోని పున్నమి రెస్టారెంట్‌ను అభివృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అలాగే పక్షుల కేంద్రంలోని అత్తిగుంట చెరువుకు చెందిన మూడు తూ ములను రైతుల కోరినట్టు మరమ్మతు చేయిస్తామని చెప్పారు. కలెక్టర్ హామీలు ఇచ్చి ఏడాది అయిన నేటి వరకు ఇందులో ఏ ఒక్కటి అమలు కాలేదు.
పక్షుల పండుగ సమయంలో సమస్యలివీ
పాట్లు తప్పవా?


