టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా

Jan 5 2026 7:27 AM | Updated on Jan 5 2026 7:27 AM

టీడీప

టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా

● రెచ్చిపోతున్న అక్రమార్కులు ● డీసిల్టింగ్‌ మాటున సై‘ఖతం’ ● యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు ● నిత్యం వందలాది వాహనాలతో తరలింపు ● మా రాజ్యం.. మా ఇష్టం అంటూ బెదిరింపులు ● మామూళ్ల మత్తులో సహకరిస్తున్న అధికారులు

● రెచ్చిపోతున్న అక్రమార్కులు ● డీసిల్టింగ్‌ మాటున సై‘ఖతం’ ● యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు ● నిత్యం వందలాది వాహనాలతో తరలింపు ● మా రాజ్యం.. మా ఇష్టం అంటూ బెదిరింపులు ● మామూళ్ల మత్తులో సహకరిస్తున్న అధికారులు

చట్ట విరుద్ధంగా తవ్వకాలు

డీసిల్టింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా పట్టపగలే కలవకూరు వద్ద స్వర్ణముఖినదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. డీసిల్టింగ్‌ అంటే నదిలో పేరుకున్న మట్టి, ఇసుక పొరను కూలీలతో మాత్రమే తవ్వి తీయించాలి. యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. కానీ, ఇసుకాసురులు మాత్రం యంత్రాలతో యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దీంతో నది భారీ గుంతలతో నిండిపోయింది. ఈ క్రమంలోనే అనుమతులు లేని ప్రాంతాల్లో కూడా ఇసుక దోపిడీ సాగిస్తున్నారు. ముఖ్యంగా పెన్నేపల్లి, ఎగువచావలి, కప్పగుంటకండ్రిగ, పెరుమాళ్లపల్లి, పెళ్లకూరు, రావులపాడు, పుల్లూరు తదితర ప్రాంతాల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టి, మేనకూరు సెజ్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

పెళ్లకూరు : చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నేతల అక్రమార్జనకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నిబంధనలను తుంగలో తొక్కి ప్రకృతి వనరులను దోచేసుకుంటున్నారు. పచ్చమూక నేతృత్వంలో ఇసుక మాఫియా స్వర్ణముఖి నదిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తోంది. వరద నీరు ప్రవహిస్తున్నాలెక్క చేయకుండా నేరుగా నదిలోకి గ్రావెల్‌రోడ్డు ఏర్పాటు చేసుకుంది. యంత్రాలతో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తోంది.

నీటి కష్టాలు తప్పవు

మండలంలోని పదివేల ఎకరాలకు పైగా సాగునీరు, 20 గ్రామాల్లోని రక్షిత పథకాలకు తాగునీరు స్వర్ణముఖి నది నుంచి సరఫరా అవుతోంది. ఇక్కడి ప్రజలందరికి ఈ నది జీవనాధారం. నదికి ఇరువైపుల వ్యవసాయ విద్యుత్‌ మోటార్లు కింద 10వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నదిలోని వ్యవసాయ బోర్లు వద్ద కూడా యంత్రాలతో ఇసుక తోడేయడంతో బోర్లకు నీరు అందడం లేదని వాపోతున్నారు. ఇసుక స్మగ్లింగ్‌ను అరికట్టాల్సిన పోలీసులు సైతం మాఫియాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వెంకటగిరి, శ్రీకాళహస్తి, నాయుడుపేట ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. దీంతో తమకు నీటి కష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్వర్ణముఖిలో లారీలకు

ఇసుక లోడింగ్‌ చేస్తున్న హిటాచీలు

వరద ప్రవాహంలో సైతం ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న దృశ్యం

పరిశీలించి చర్యలు

స్వర్ణముఖినదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్దం. నిబంధనలు మేరకు కూలీతోనే ఇసుక తీసి అవసరాల నిమిత్తం వినియోగించుకోవాలి. డీసిల్టింగ్‌ పాయింట్‌ వద్ద యంత్రాలతో తవ్వకాలు చేపడుతుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాసరావు, ఏడీ, మైనింగ్‌శాఖ

టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా 
1
1/3

టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా

టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా 
2
2/3

టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా

టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా 
3
3/3

టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement