కష్టాలు అన్నీఇన్నీ కావు | - | Sakshi
Sakshi News home page

కష్టాలు అన్నీఇన్నీ కావు

Jan 5 2026 7:27 AM | Updated on Jan 5 2026 7:27 AM

కష్టా

కష్టాలు అన్నీఇన్నీ కావు

యూరియా కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోంది. పైగా ఎరువు ధరలు పెంచేశారు. దీంతో పెట్టుబడి ఎక్కువ అయిపోతోంది. ప్రభుత్వం ఇలా పట్టించుకోకపోవడం సరికాదు. ధాన్యానికి అయినా సరైన గిట్టుబాటు ధర కల్పిస్తారా లేదా అనే అందోళన తప్పడం లేదు. చంద్రబాబు పాలనతో రైతుల కష్టా లు అన్నీ ఇన్నీ కావు. – రాము, రైతు, మదనంబేడు

వేరుశనగకు ఎగనామం

వేరుశనగ సబ్సిడీ విత్తనాలకు ఈ రబీ సీజన్‌లో పూర్తిగా ఎగనామం పెట్టారు. ఎరువుల ధరలు చూస్తే చుక్కలు చూపిసుతన్నాయి. ఇక యూరియా కష్టాలు తెలిసిందే. దీంతో ప్రతి రైతు ఆందోళనలోనే ఉన్నాడు. ప్రభుత్వం ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదు.

– బాలయ్య రైతు, వరదయ్యపాళెం

ధర పెంచేశారు

ప్రతి ఎరువు ధరా పెంచేశారు. బస్తాపై రూ.100కు పైగా ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీనిపై దుకాణం వాళ్లను ప్రశ్నిస్తే ఎరువులు లేవంటున్నారు. దీంతో చేసేది ఏమీ లేక వాళ్లు చెప్పిన ధర చెల్లించి తీసుకుపోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం పూర్తిగా ఇబ్బందుల్లో పడింది. – చిన్న ముమ్మయ్య, రైతు, ఓజిలి

గిట్టుబాటు కల్పించాలి

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. దళారీ బారిన పడకుండా ప్రభుత్వమే ముందస్తు చర్యలు చేపట్టాలి. పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలి. ఎరువుల ధరలకు కుదేలైన అన్నదాతలను గిట్టుబాటు ధరలతో ఆదుకోవాలి.

– చంద్రశేఖర్‌రెడ్డి, రైతు, ఏఎం పురం

కష్టాలు అన్నీఇన్నీ కావు 
1
1/3

కష్టాలు అన్నీఇన్నీ కావు

కష్టాలు అన్నీఇన్నీ కావు 
2
2/3

కష్టాలు అన్నీఇన్నీ కావు

కష్టాలు అన్నీఇన్నీ కావు 
3
3/3

కష్టాలు అన్నీఇన్నీ కావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement