వీఆర్‌కు చిట్టమూరు ఎస్‌ఐ | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌కు చిట్టమూరు ఎస్‌ఐ

Jan 5 2026 7:27 AM | Updated on Jan 5 2026 7:27 AM

వీఆర్

వీఆర్‌కు చిట్టమూరు ఎస్‌ఐ

చిట్టమూరు : కోడి పందేలను అరికట్టడంలో విఫలమైన చిట్టమూరు ఎస్‌ఐ చిన బలరామయ్యను వీఆర్‌కు పంపించినట్లు సమాచారం. మండలంలోని దరఖాస్తు గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందేలా స్థావరంపై సాక్షి పత్రిలో ఆదివారం పడగ విప్పిన పందేలు శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై ఎస్పీ సుబ్బరాయుడు పూర్తి సమాచారం తెప్పించుకుని ఎస్‌ఐను వీఆర్‌కు పంపినట్లు తెలిసింది. దీనిపై పోలీసు అధికారులు నోరు విప్పకపోవడం గమనార్హం.

నేడు కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్‌’

తిరుపతి అర్బన్‌ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌)ను కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీలు స్వీకరించనున్నారు. జిల్లా పునర్విభజన నేపథ్యంలో మండలాలు పెరగడంతో అదే స్థాయిలో వినతుల సంఖ్య ఉండవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ గ్రీవెన్స్‌ నుంచి గూడూరు, కోట, చిల్లకూరు మండలాలవారు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు కలెక్టరేట్‌లో అర్జీలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గంలోని కోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలు, పుల్లంపేట, పెనగలూరు మండలాలకు చెందిన వారు తిరుపతి కలెక్టరేట్‌కు రానున్నారు.

రాయలసీమకు మరణ శాసనం రాసిన చంద్రబాబు

చిట్టమూరు: రాయలసీమ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సారి దారుణంగా వెన్నుపోటు పొడిచి, మరణశాసనం రాశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మేథావుల ఫోరం ప్రధాన కార్యదర్శి ఎస్వీ సుబ్రమణ్యంరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిట్టమూరు మండలం, గునపాటిపాళెం గ్రామానికి చెందిన ఎస్వీ సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ తాను కోరితేనే చంద్రబాబు రాయలసీమకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు ఆపేశారని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబుతో ఏకాంత సమావేశంలో తానుకోరగానే ఆయన ఒప్పుకున్నారని పేర్కొన్నారు. అందుకనే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు ఆగిపోయాయని, నిజనిర్ధారణ కమిటీ కూడా వెళ్లి చూసుకోవచ్చన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమకు తాగు, సాగు నీరు అవసరాలను దృష్టిలో ఉంచుకుని లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు తీసుకొస్తే, చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ఆ ప్రాజెక్టులను ఆపేసి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని పేర్కొన్నారు.

టీటీడీ నిధుల

దుర్వినియోగం తగదు

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: రాజకీయ పార్టీల అధినేతల కోరికలు, వారి ప్రయోజనాల కోసం టీటీడీ నిధులను దుర్వినియోగం చేయడం తగదని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షుడు కందారపు మురళి కోరారు. ఆదివారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సిఫారసు మేరకు రూ.35 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. గతంలో అక్కడి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి కేటాయించలేదని తెలిపారు. ప్రస్తుత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం రూపాయి కూడా విడుదల చేయలేదని వెల్లడించారు. అయితే పవన్‌ కల్యాణ్‌ ఒత్తిడి మేరకు టీటీడీ రూ.35 కోట్లు కేటాయించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. నేతలను సంతోష పెట్టేందుకు టీటీడీని బలి చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు.

వేర్వేరు చోట్ల ‘పందేల’పై దాడి

సైదాపురం : మండలంలోని తూర్పుపూండ్ల శివారులో ఆదివారం నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై ఎస్‌ఐ క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో దాడి చేశారు. 10మంది పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. రూ.11,100 స్వాధీనం చేసుకున్నారు.

దొరవారిసత్రం : మండలంలోని రామారెడ్డికండ్రిగ సమీపంలో కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు బైక్‌లు, రెండు కోళ్లు, రూ.540 స్వాధీనం చేసుకున్నారు.

వెంకటగిరి రూరల్‌ : బాలాయపల్లె మండలం పిగిలాం ఎస్సీ కాలనీ సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందేలపై ఎస్‌ఐ గోపి దాడి చేశారు. 16 మంది పందెంరాయుళ్లు, 10 ద్విక్ర వాహనాలు, రూ.8,190 నగదు, 8 సెల్‌ఫోన్లు, 3 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

వీఆర్‌కు చిట్టమూరు ఎస్‌ఐ 
1
1/3

వీఆర్‌కు చిట్టమూరు ఎస్‌ఐ

వీఆర్‌కు చిట్టమూరు ఎస్‌ఐ 
2
2/3

వీఆర్‌కు చిట్టమూరు ఎస్‌ఐ

వీఆర్‌కు చిట్టమూరు ఎస్‌ఐ 
3
3/3

వీఆర్‌కు చిట్టమూరు ఎస్‌ఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement