జూన్‌ 10 వరకు ధాన్యం కొనాలి | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 10 వరకు ధాన్యం కొనాలి

Jan 4 2026 11:12 AM | Updated on Jan 4 2026 11:12 AM

జూన్‌

జూన్‌ 10 వరకు ధాన్యం కొనాలి

ఈ ఏడాది సాగు పెరిగింది. ఈ క్రమంలో జూన్‌ 10 వరకు వరి ధాన్యం కొనుగో లు చేయాలని కోరుతున్నాం. యూరియా కోసం ఇప్పటి వరకు పోరాటాలు చేశాం. ఇక ధాన్యం కొనుగోలు కోసం పోరాటాలు చేయా ల్సి వస్తుంది. ఫిబ్రవరిలో మొదలు పెట్టి మార్చిలో ముగించేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రైతులు అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. – వేనాటి ప్రకాష్‌రెడ్డి,

రైతు, గొల్లలమలుపు, తడ మండలం

పాత ధరలే ఇవ్వడం భావ్యం కాదు

ధాన్యానికి గత ఏడాది ఇచ్చిన ధరలే ఈ ఏడాది ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం భావ్యం కాదు. ఏటా పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో కాస్తాకూస్తో పెంచేవారు. అలాగే పెంచితేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. లేదంటే రైతుకు నష్టం వస్తుంది. ఈ అంశాన్ని అధికారులు తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి కోరుతున్నాం.

– హరినాద్‌ యాదవ్‌, రైతు,

అమ్మవారిపట్టెడ, రేణిగుంట మండలం

ఏపీ సీడ్స్‌ కొనుగోలు నిలుపుదల

ఏటా లక్ష టన్నులకు పైగా ఏపీ సీడ్సీ వారు ధాన్యం కొనుగోలు చేసేవారు. అయితే ఈ ఏడాది వారు నిలిపివేశారు. ఈ సందర్భంగా రైతులు సంఖ్యతోపాటు ధాన్యం పెరుగుతుంది. ఆ ప్రభావంతో కొందరి రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తే మిగిలిన రైతులకు తీవ్రమైన నష్టం వస్తుంది. ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నాం. – మహేష్‌, రైతు, తిప్పిరెడ్డిగారి పల్లి

గ్రామం, చిన్నగొట్టిగల్లు మండలం

కుంటిసాకులు చెప్పొద్దు

ఈకేవైసీ చేయలేదు..పంట ఈ–క్రాప్‌ లేదు, మట్టి, రాళ్లు, చెత్త, జల్లు, రంగు మారింది, పరిపక్వం లేదు, కేళ్లు ఉన్నాయి, తేమ ఉంది అంటూ ధాన్యం కొనుగోలు చేయకుండా వదిలిపెడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. లోటుపాట్లు ఉంటే ముందే చెబితే ధాన్యం నాణ్యతగా ఉంచుతాం. అంతేతప్ప చిన్న చిన్న సమస్యలు చూపించి రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోం. – దయాకర్‌రెడ్డి, రైతు,

కనమనంబేడు, బీఎన్‌ కండ్రిగ మండలం

దోపిడి సిద్ధంగా ఉన్నారు

కొందరు ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరలకే ధాన్యం కొనుగోలు చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే తుకాల్లో మోసాలు చేయడానికీ వారు సిద్ధమే. మరోవైపు రైస్‌ మిల్లర్లు మోసాలు చేయకుండా చూడాల్సి ఉంది. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తే న్యాయం జరుగుతుంది.

– రమేష్‌, గొల్లపాళెం గ్రామం రైతు,

వాకాడు మండలం

జూన్‌ 10 వరకు ధాన్యం కొనాలి 
1
1/4

జూన్‌ 10 వరకు ధాన్యం కొనాలి

జూన్‌ 10 వరకు ధాన్యం కొనాలి 
2
2/4

జూన్‌ 10 వరకు ధాన్యం కొనాలి

జూన్‌ 10 వరకు ధాన్యం కొనాలి 
3
3/4

జూన్‌ 10 వరకు ధాన్యం కొనాలి

జూన్‌ 10 వరకు ధాన్యం కొనాలి 
4
4/4

జూన్‌ 10 వరకు ధాన్యం కొనాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement