యథేచ్ఛగా అక్రమ చేపల వేట
రేణిగుంట: మండలంలోని పెద్ద చెరువుల్లో ఒకటైన వెంకటాపురం చెరువులో స్థానిక అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా అక్రమ చేప వేటను కొనసాగిస్తున్నా మత్స్యశాఖాధికారలు కనీస చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. మత్స్యకార శాఖ మూడేళ్ల కిందట చెరువుకు సొసైటీని ఏర్పాటు చేసింది. అందులో చైర్మన్‌తో పాటు 55 మంది సభ్యులు ఉన్నారు. గతంలో వారి ఆధ్వర్యంలో ప్రభుత్వాని కి సంవత్సరానికి ఒకసారి నగదు చెల్లించి, చేపల వేట సాగించేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొసైటీని పక్కనపెట్టి స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకుని పంచాయతీలోని అధికార పార్టీ నాయకులు గతంలో చెరువులోని మట్టిని అక్రమంగా తవ్వి రూ.లక్షలు గడించారు. అది చాలదన్నట్లు ప్రస్తుతం అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రభుత్వానికి రూపాయి కూడా చెల్లించకుండా, సొసైటీలోని సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చేపలను యథేచ్ఛగా పట్టుకుని, రూ.లక్షలు దోచేస్తున్నారు. శనివారం పట్టపగలు పంచాయతీ కార్యాలయం ఎదురుగానే అక్రమ చేపల వేట సాగుతున్నా అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
జాతీయస్థాయి జూడో పోటీలకు గురుకుల విద్యార్థి
చిల్లకూరు: చిల్లకూరు బాలుర గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే యూ బాలు అనే విద్యార్థి అండర్–14 విభాగంలో జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎంపికై నట్లు శనివారం ఆ గురుకులం పీడీ శ్రీరేష్ తెలిపారు. ఇటీవల జరిగిన 69వ స్కూల్ గేమ్స్ పెడరేషన్ క్రీడా పోటీల్లో భాగంగా గురుకుల బాలుర పాఠశాలలో చదివే బాలు అనే విద్యార్థి అండర్ –14 విభాగంలో అనంతపురం జిల్లాలోని చిగిచెర్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని, ప్రతిభ కనపరిచి బంగారు పతకం సాధించాడని తెలిపారు. దీంతో బాలుడిని జాతీయ స్థాయిలో జరిగే జూడో పోటీలకు ఎంపిక చేశారన్నారు. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రం లూథియానాలో జరిగే జూడో పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆ క్రీడాకారుడిని పాఠశాల ప్రిన్సిపల్ అనిల్‌కుమార్, పీఈటీ రాజేంద్రలు అభినందించారు.
36వ బ్యాచ్‌కి వీడ్కోలు
తిరుపతి అర్బన్: అలిపిరి డిపోలో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కళాశాలలో 36వ బ్యాచ్‌కి శిక్షణ పూర్తి కావడంతో వారికి శిక్షణ పూర్తి చేసుకున్నట్లుగా ధ్రువీకరణ పత్రాలను డీఎం హరిబాబు శనివారం అందజేశారు. ఆ పత్రాలను వారు ఆర్టీఓ కార్యాలయంలో చూపితే వారికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌ను జారీ చేశారు. అలాగే శనివారం 37వ బ్యాచ్‌కి స్వాగతం పలికారు. వారికి శిక్షణ మొదలుపెట్టారు. మరోవైపు వచ్చే సోమవారం నుంచి 38వ బ్యాచ్‌కి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో బ్యాచ్‌ల్ 16 మందికి 32 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో నిర్వహకుడు రాము పాల్గొన్నారు.
యథేచ్ఛగా అక్రమ చేపల వేట


