చెవిరెడ్డి జీవితంలో చీకటి తొలగాలి
తిరుపతి మంగళం : పది మందికి మంచి చేసే గుణం తప్ప చెడు చేసే తత్వం లేని నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అని, ఆయన జీవితంలో చీకటి తొలగాలని మంగళంలోని రణధీర్‌పురం, సప్తగిరినగర్ పంచాయతీల వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జిలు లక్ష్మీనారాయణ, అశోక్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లిక్కర్ స్కామ్ పేరుతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ నిర్బంధానికి 200 రోజులు నిండాయి. ఈ నేపథ్యంలో మంగళం రణధీర్‌పురం, సప్తగిరినగర్ పంచాయతీల్లో శనివారం ఆ పార్టీ నేతలు లక్ష్మీనారాయణ, అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జీవితంలో చీకటి తొలగాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేసుకుని లిక్కర్ స్కామ్ పేరుతో అక్రమ అరెస్టులు చేయించి, జైళ్లల్లో పెట్టారని మండిపడ్డారు. లిక్కర్ వాసన తెలియని, మద్యమే కాదు మద్యం తాగినవాళ్లను కూడా ఇంట్లోకి అనుమతించని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టడం చంద్రబాబు నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎప్పటికై నా న్యాయం గెలుస్తుందని, కడిగిన ముత్యంలా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జైలు నుంచి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా కార్యనిర్వాహక సభ్యురాలు వి.దీపశ్రీ, ఉపసర్పంచ్ మల్లెమొగ్గల ఉమాపతి, పంచాయతీల అధ్యక్షులు మహ్మద్‌ఖాసీమ్ బాషా, రజాక్, వార్డు సభ్యులు మురగేష్, సతీష్, మురళి, భాస్కర్‌యాదవ్, మహేశ్వరరెడ్డి, మణి, మంజుల, ధనమ్మ, పార్టీ నాయకులు మోహన్, భాస్కర్‌రెడ్డి, బీఆర్కే రమేష్, ఎంఎస్‌ఆర్, శరణ్, గిరిబాబు, రెడ్డెప్ప, వాసు తదితరులు పాల్గొన్నారు.


