సందర్శకుల సందడి
నేలపట్టులో
దొరవారిసత్రం: నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో నూతన సంవత్సరం సందర్భంగా వందలాది మంది సందర్శకులు, పాఠశాల విద్యార్థులతో గురువారం కిక్కిరిసింది. పలు ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికు లు, పర్యాటకులు ఉదయం 9 గంటలకే పక్షుల కేంద్రానికి చేరుకుని విహంగాలను వీక్షించి, ఇక్కడే వారి వెంట తీసుకువచ్చిన ఆహార పదార్థాలను తిని రోజంతా కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపి వెళ్లారు. చెరువుల్లోని కడప చెట్లపై విడిది చేసే విహంగాలను వీక్షిచండమే కాకుండా పర్యావరణ కేంద్రంలోని కృత్రిమ విహంగాలు పక్షి జాతుల ప్రాధ్యానతతో పాటు పర్యావరణ కేంద్రంలో జీవన శైలి చిత్రాలను స్థానిక వన్యప్రాణి సిబ్బంది ప్రదర్శించారు. మార్గం మధ్యలోని జింకల పార్క్‌లో ఉన్న జింకలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. పిల్లల పార్కులో చిన్నారులు ఆటపాటలతో ఆనందంగా గడిపారు. తిరుపతి, విజయవాడ, చైన్నె, బెంగళూరు, గూడూరు, నెల్లూరు, చిత్తూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల నుంచి వాహనాల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేశారు. సందర్శకుల కోసం వన్యప్రాణి విభాగం అధికారులు తాగునీటి వసతి, చెరువు కట్టపై ఉన్న వ్యూ పాయింట్లు వద్ద పక్షులను దగ్గరగా వీక్షించేలా బైనోక్యూలర్లు తదితరాలు అందుబాటులో ఉంచారు.
సందర్శకుల సందడి


